No matter the danger, He shared God's Word. Five hundred years ago, no one possessed a Bible in the English language. Since worship services in England were conducted in Latin, ordinary people—often referred to as "ploughboys"—knew nothing about the salvation found through faith in Jesus...
No matter the danger,
He shared God's Word.
Five hundred years ago, no one possessed a Bible in the English language. Since worship services in England were conducted in Latin, ordinary people—often referred to as "ploughboys"—knew nothing about the salvation found through faith in Jesus Christ.
However, one man dared to dream: to prepare a Bible in language that English ploughboys could understand and, through it, spread the Gospel. William Tyndale, a distinguished scholar of Greek, Hebrew, and Latin, possessed the unique talent required to translate the Bible into English. When church authorities opposed his undertaking, Tyndale resolved to continue his translation efforts, regardless of the severity of the danger he faced.
Despite facing persecution, hunger, and hardship, Tyndale tenaciously pursued his mission and translated significant portions of the Bible. He faithfully continued his work until he was betrayed by those he trusted, arrested, convicted of heresy, and burned alive at the stake. It was through his sacrifices that the English ploughboy gained access to the Bible. Tyndale’s unwavering determination to share God's Word in the language of the common people continues to bring about change in the world today.
ఎంతటి అపాయం ఎదురైనా సరే,
అతడు దేవుని వాక్యం పంచుకుంటాడు
ఐదు వందల ఏళ్ల క్రితం, ఆంగ్లభాషలో బైబిల్ ఏ ఒక్కరి దగ్గరా లేదు. ఇంగ్లండు దేశంలో ఆరాధనలు లాటిన్ భాషలో నిర్వహించేవారు గనుక ఆంగ్ల రైతులు లేక తరచు “దుక్కిదున్నేవారు”గా పిలువబడే సామాన్యులకు యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా లభించే రక్షణ గురించి ఏమీ తెలియదు.
అయితే ఒక వ్యక్తి కలలు కన్నాడు. ఏదో ఒకరోజున ఆంగ్ల రైతులు అర్థంచేసుకోగల మాటల్లో బైబిల్ని సిద్ధం చేసి, తద్వారా సువార్తను వ్యాపింపజేయాలని. ఐరోపా ఖండంలోనే గ్రీకు, హీబ్రూ, లాటిన్ భాషలలో ప్రముఖ పండితులలో ఒకరైన విలియమ్ టిండేల్ బైబిల్ని ఆంగ్లంలోకి అనువదించే అద్వితీయమైన ప్రతిభను సొంతం చేసుకున్నాడు. తాను తలపెట్టిన పనిని సంఘ
అధికారులు వ్యతిరేకించినప్పుడు, తనకు ఎదురయ్యే ప్రమాదం ఎంత తీవ్రమైనా సరే, తన అనువాద ప్రయత్నాలను కొనసాగించాలని టిండేల్ నిశ్చయించుకున్నాడు.
హింస, ఆకలి, కష్టాలు ఎన్ని ఎదురైనా, టిండేల్ తన కర్తవ్యాన్ని పట్టుదలతో కొనసాగించి బైబిల్లోని అనేక భాగాలు తర్జుమా చేసాడు. నమ్మినవారే ద్రోహం చేయడంతో, బంధించబడి, మత విద్రోహిగా నేరం రుజువు చేయబడి, నిలువు కొయ్యపై సజీవదహనం చేయబడేవరకు ఆ పనిని నమ్మకంగా కొనసాగించాడు. ఆయన చేసిన త్యాగాల ఫలితంగా ఆంగ్ల రైతుకి బైబిల్ దొరికింది. సామాన్య ప్రజల భాషలో దేవుని వాక్యాన్ని పంచుకోవాలన్న టిండేల్ కృతనిశ్చయం నేటికీ ప్రపంచంలో మార్పును కలిగిస్తూనే ఉంది.